News June 20, 2024

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండపల్లి శ్రీనివాస్

image

ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొండపల్లి శ్రీనివాస్ గురువారం మంగళగిరిలో మధ్యతరహా పరిశ్రమ, SERP, NRI వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనవంతుగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. బాధ్యతలు స్వీకరించే సమయంలో ఆయన వెంట కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

Similar News

News November 15, 2025

VZM: కుష్టు వ్యాధిపై అవగాహన రథాన్ని ప్రారంభించిన DMHO

image

జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈ నెల 17 నుంచి 30 వరకు ఇంటింటి సర్వే ద్వారా కుష్టు కేసులను గుర్తించే “లెప్రసీ కేస్ డిటెక్షన్ కాంపెయిన్” జరగనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. జీవనరాణి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించే ఆటో ప్రచార రథాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అన్ని గ్రామాల్లో ప్రజలు ఆరోగ్య కార్యకర్తలకు సహకరించాలన్నారు.

News November 15, 2025

ఉపాధి హామీలో లక్ష్యాలు పూర్తి చేయాలి: VZM కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం కింద రోజువారీ లక్ష్యాలను పూర్తి చేసి, ప్రతి కుటుంబానికి 100 రోజుల పనులు శాత శాతంగా అందించాల్సిన అవసరాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉపాధి పనులపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్, డ్వామా పథక సంచాలకులు, ఏపీడీలు, ఏపీవోలు, ఎంపీడీవోలతో మండల వారీ పురోగతిని సమీక్షించారు. పనిదినాలు, కనీస వేతనాలు, హాజరు శాతం వంటి అంశాలపై విశ్లేశించారు.

News November 15, 2025

ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి: ఎస్.కోట సీఐ

image

ఎస్.కోట అగ్నిమాపక కేంద్రంలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్ (39) వెన్ను, కడుపునొప్పి తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు CI నారాయణ మూర్తి తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. సెలవుపై ఇంటిలోనే ఉంటున్నాడు. ఈనెల 13న పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అతని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.