News August 12, 2024
మంత్రిని కలిసిన ఆత్రం సుగుణ

మహారాష్ట్ర పర్యటనకు వెళ్తున్న మంత్రి సీతక్క ఆదివారం రాత్రి ఉట్నూర్ మండల కేంద్రంలో కాసేపు ఆగారు. ఈసందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ నాయకురాలు అత్రం సుగుణ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఉట్నూర్, జైనూర్ మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని నియమించాలని సుగుణ కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News December 22, 2025
ఎస్పీ గ్రీవెన్స్‌కు 32 ఫిర్యాదు: ADB ఎస్పీ

పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి 32 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాల ఫిర్యాదు కోసం ప్రజలు 8712659973 నంబర్‌కు వాట్సప్ ద్వారా సమాచారం అందజేయాలని వివరించారు.
News December 22, 2025
మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన జోగు రామన్న

ఆదిలాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును సోమవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో మాజీ మంత్రి జోగురామన్న కలిశారు. గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తిచేయాలని కోరారు. అదేవిధంగా చనాక కొరాట ప్రాజెక్టుకు సంబంధించి పనులను త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు జోగురామన్న తెలిపారు.
News December 21, 2025
ఆదిలాబాద్: సోమవారం ప్రజావాణి యథాతథం

ఈ సోమవారం (22 వ తేదీ) నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు ఎవరైనా తమ సమస్యల గురించి దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.


