News June 14, 2024

మంత్రిపదవిపై అయ్యన్నపాత్రుడి రియాక్షన్

image

జూనియర్లకు మంత్రులుగా అవకాశం రావడం పట్ల సీనియర్‌గా ఆహ్వానిస్తున్నానని అయ్యన్నపాత్రుడు గురువారం తెలిపారు. సీనియర్లకు అవకాశం ఇవ్వలేదంటున్నారని.. తనకు 25 ఏళ్లకే NTR మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ‘ఇప్పటికే 5సార్లు మంత్రిగా, ఒకసారి MPగా చేశాను మిగతావారికి కూడా అవకాశం ఇవ్వాలి కదా’ అని పేర్కొన్నారు. ‘పదవి రానివారిని చంద్రబాబు ఓదార్చాలా.. మాకు MLA టికెట్ ఇవ్వడమే గొప్ప’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News September 10, 2024

పల్లా శ్రీనివాసరావుకు అస్వస్థత..!

image

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల విజయవాడ వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఆయన మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయనకు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన అవసరం లేదని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

News September 10, 2024

అల్లూరి: అలిగి పుట్టింటికి వచ్చి మృతి

image

గూడెం కొత్తవీధి మండలం చట్రాపల్లికి చెందిన పండన్న పెద్ద కుమార్తె కొర్ర కుమారి(20)కి రెండేళ్ల క్రితం చింతపల్లి మండలం దోమలగొందికి చెందిన రాజుతో వివాహమైంది. భర్త తరచూ తాగి ఇంటికి వస్తుండడంతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారం రోజుల క్రితం కుమారి భర్తపై అలిగి చట్రాపల్లి పట్టింటికి వచ్చేసింది. కొండచరియలు పండన్న ఇంటిపై పడడంతో నిద్రలోనే ఆమె మృతి చెందింది. కుమారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 10, 2024

విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది సీఐలు బదిలీ

image

విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది సీఐలను బదిలీ చేస్తూ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉత్తర్వులను జారీ చేశారు. నర్సీపట్నం టౌన్లో పనిచేస్తున్న త్రిపురాన క్రాంతికుమార్‌ను వీఆర్‌కు, వీఆర్‌లో ఉన్న సీఐ వానపల్లి నాగరాజును శ్రీకాకుళం ట్రాఫిక్ సీఐగా, ఎంవీవీ రమణమూర్తిని విజయనగరానికి, బుచ్చిరాజును అనకాపల్లి పీసీఆర్ సీఐగా, జీ.దుర్గాప్రసాద్‌ను అల్లూరి సోషల్ మీడియా సైబర్ సెల్ సీఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.