News March 20, 2025
మంత్రివర్గ ఉప సంఘం భేటీలో నెల్లూరు మంత్రులు

అమరావతిలోని సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం భేటీ అయ్యింది. ఈ భేటీకి నెల్లూరు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ హాజరయ్యారు. భూ పరిపాలన సంస్కరణలపై వారు చర్చించారు. ప్రధానంగా మంత్రి వర్గ ఉప సంఘంలో ఫ్రీ హోల్డ్ భూములపై చర్చ సాగింది.
Similar News
News March 21, 2025
నెల్లూరు: 84ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్ట్

వరికుంటపాడు మండల శివారు ప్రాంతంలో ఈనెల 16వ తేదీన రాత్రి సమయంలో నిద్రిస్తున్న 84 ఏళ్ల వృద్ధురాలిపై గొల్లపల్లి గురవయ్య అనే యువకుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించి పరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వృద్ధురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు ఆచూకీ కోసం వరికుంటపాడు ఎస్ఐ రఘునాథ్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎట్టకేలకు అదుపులోకి తీసుకొని ఉదయగిరి కోర్టులో హాజరు పరిచారు.
News March 21, 2025
పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా చూడండి: కలెక్టర్

నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా, అనుమతులు మంజూరు చేసి పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల పురోగతి, పీఎంఈజీసి రుణాల మంజూరు అంశాలను కలెక్టర్కు వివరించారు.
News March 20, 2025
నెల్లూరు: ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం

నెల్లూరు కేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో గురువారం ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమైందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి డాక్టర్ ఏ శ్రీనివాసులు తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో మూల్యాంకనం పూర్తవుతుందని ఆర్ఐఓ తెలిపారు.