News March 13, 2025
మంత్రి అచ్చెన్నాయుడుపై కేసు కొట్టివేత

ఓబులాపురం మైనింగ్పై గతంలో టీడీపీ నేతలు చేసిన ఆందోళనలకు సంబంధించిన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చినరాజప్ప, ధూళిపాళ్ల నరేంద్ర, జనార్దన్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ కేసు నుంచి విముక్తి పొందారు. గురువారం ఉదయం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకున్నారు.
Similar News
News March 14, 2025
SKLM: పలాసలో 23న స్వాతంత్ర్య సమరయోధుల సంస్మరణ సభ

పలాస మండలం మా కన్నపల్లి గ్రామంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ దేవ్ల సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం నాయకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని అన్నారు. ప్రజలు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
News March 14, 2025
శ్రీకాకుళం: పాఠశాలలకు నేడు సెలవు.. రేపటినుంచి ఒంటి పూట బడులు

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు హోలీ పండుగ సందర్భంగా శుక్రవారం సెలవు ప్రకటించారని డీఈఓ తిరుమల చైతన్య తెలిపారు. గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ శనివారం నుంచి ఒంటి పూట బడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఉదయం 7:45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు కొనసాగుతాయి. అయితే మధ్యాహ్న భోజనం యథాతథంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
News March 14, 2025
టెక్కలి: ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు

టెక్కలి మండలం పెద్దసాన ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. పాఠశాలలో విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో వారి ఫిర్యాదు మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ చేపట్టి ఆయనను సస్పెండ్ చేశారు. కాగా ఈ ఆరోపణలు ఉన్న ఉపాధ్యాయుడు గతంలో కూడా ఒకసారి సస్పెన్షన్కు గురయ్యారు.