News March 15, 2025
మంత్రి ఉత్తమ్తో తుమ్మల భేటీ..!

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సీతారామ ప్రాజెక్ట్ మిగిలిన పనులపై సమావేశమయ్యారు. తుమ్మల మాట్లాడుతూ.. భూసేకరణను వేగవంతం చేయాలని భద్రాద్రి, ఖమ్మం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సత్తుపల్లి ట్రంక్ పనులు, 4వ పంపు హౌస్ నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేయాలని సూచించారు. పని నాణ్యత, ఖర్చు నియంత్రణ, సమయపాలనపై అధికారులు దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల సూచించారు.
Similar News
News December 6, 2025
శబరిమలలో శ్రీకాకుళం జిల్లా వాసి మృతి

శబరిమలలో శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీ కూటికుప్పలపేటకు చెందిన గురుగుబెల్లి వరాహ నరసింహులు (72) మృతి చెందారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లగా శుక్రవారం గుండెపోటుతో మృతిచెందినట్లు తోటి భక్తులు మృతుని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్లో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువస్తున్నారు.
News December 6, 2025
హైదరాబాద్లో హారన్ మోతలకు చెక్.!

హైదరాబాద్లో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతోంది. దీనికితోడు హారన్ల మోత మోగుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు యోచిస్తున్నారు. ముంబై తరహాలో “హాంక్ మోర్ వెయిట్ మోర్” పద్ధతిని తీసుకురానున్నారు. దీంతో రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎంత ఎక్కువగా హారన్ కొడితే అంత ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తుంది. దీని వల్ల ముంబైలో 60% సౌండ్ పొల్యూషన్ తగ్గింది. ఇదే తరహాలో ఇక్కడ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
News December 6, 2025
నేడు అంబేడ్కర్ వర్థంతి.. నారా లోకేశ్ ట్వీట్

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను అంటూ మంత్రి నారా లోకేశ్ ‘X’ లో పోస్ట్ చేశారు. ‘దళితుల సాధికారత, పేద, బడుగు వర్గాల శ్రేయస్సు కోసం ఆయన జీవితాంతం కృషిచేశారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం పరితపించారు. నవభారత నిర్మాణానికి బాటలు వేసిన దార్శనికుడు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం కృషిచేద్దాం’ అంటూ రాసుకొచ్చారు.


