News February 14, 2025
మంత్రి గన్‌మెన్ వెంకటరమణను సస్పెండ్ చేసిన ఎస్పీ

రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న జి.వెంకటరమణను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సస్పెండ్ చేశారు. వెంకటరమణ ఇటీవల సాలూరు నుంచి విజయనగరం వస్తుండగా బుల్లెట్ మ్యాగ్జైన్తో ఉన్న బ్యాగ్ మిస్ అయ్యింది. దీంతో ఆయన విజయనగరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News November 18, 2025
తలసానిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్.. మామ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తలసానికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.
News November 18, 2025
అనకాపల్లి జిల్లాలో 2,42,480 రైతులకు లబ్ధి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం కింద 2,42,480 మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. 19వ తేదీన రైతుల ఖాతాల్లో రూ.158.4 కోట్లు జమ కానున్నట్లు పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో 22,300, చోడవరంలో 51,260, మాడుగులలో 45,340, నర్సీపట్నంలో35,040, పాయకరావుపేటలో 39,300, ఎలమంచిలిలో 33,760 మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు.
News November 18, 2025
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిపై దృష్టి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ థింక్స్ ఆక్వా పాండ్స్” కార్యక్రమానికి మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్వా రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించే దిశగా ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.


