News August 7, 2024
మంత్రి తుమ్మలను కలిసిన గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ ఛైర్మన్

మంత్రి తుమ్మల నాగేశ్వరరావును గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఛైర్మన్ సిన్హా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఛైర్మన్తో భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలకు తెగిన పెద్దవాగు ప్రాజెక్ట్ రీ డిజైన్పై చర్చించారు. అటు మూడు గేట్ల నుంచి ఆరు గేట్లకు పెంచి 80 వేల క్యూసెక్కుల నీరు డిశ్చార్జ్ అయ్యేలా పెద్దవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణం చేయాలని మంత్రి తుమ్మల కోరారు.
Similar News
News December 15, 2025
రెండో విడత ఎన్నికలు.. ఏ పార్టీ ఎన్ని గెలిచిందంటే..!

ఖమ్మం జిల్లాలో జరిగిన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. 6 మండలాల్లో మొత్తం 183 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ పార్టీ-117, BRS-40, CPI-04, CPM-14, TDP-1, ఇండిపెండెంట్ అభ్యర్థులు 7 స్థానాల్లో గెలుపొందారు. అటు మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈనెల 17న జరగనున్నాయి.
News December 15, 2025
ఖమ్మం జిల్లాలో రెండో దశ ఎన్నికలు.. పార్టీల బలాబలాలు

▶ కూసుమంచి(41 స్థానాలు): CONG-28, BRS-12, ఇతరులు-1
▶ కామేపల్లి(24): CONG-16, BRS-6, CPI-1, TDP-1
▶ ఖమ్మం రూరల్(21): 21 CONG-9, BRS-5, CPI-3, CPM-4
▶ ముదిగొండ(25): CONG-17, BRS-2, CPM-6
▶ నేలకొండపల్లి(32): CONG-20, BRS-7, CPM-2, ఇతరులు-3
▶ తిరుమలాయపాలెం(40): CONG-27, BRS-8, CPM-2, ఇతరులు-3.
News December 14, 2025
ఖమ్మం: రెండో విడత.. ఖాతా తెరిచిన కాంగ్రెస్

కామేపల్లి మండలం పొన్నెకల్లు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ భూమిక గెలుపొందారు. సమీప అభ్యర్థిపై ఆమె 603 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భూమిక గెలుపు పట్ల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గింజల నర్సింహారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. తనను గెలిపించిన ఓటర్లకు భూమిక కృతజ్ఞతలు తెలిపారు.


