News February 28, 2025

మంత్రి తుమ్మల అనుచరుడు గాదె సత్యం మృతి

image

సత్తుపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు గాదె సత్యనారాయణ (76) ఊపిరితిత్తుల వ్యాధితో శుక్రవారం హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడిగా మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాలలో సేవలందించారు. ఆయన మృతిపట్ల మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే డా. రాగమయి దయానంద్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఆయా పార్టీల నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Similar News

News March 1, 2025

యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు:ఎస్ఐ 

image

పెళ్లి చేసుకుంటానని మహిళను గర్భవతిని చేసి ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లి చేసుకోను అని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కూచిపూడి జగదీష్ తెలిపారు. వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన బాధితురాలు (25) ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడుకి చెందిన చిర్రా మహేష్ మోసం చేశాడని ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

News March 1, 2025

 ‘మీసేవ’ కేంద్రాల్లో  విజిలెన్స్ తనిఖీలు

image

తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ ( టీజీఎస్టీఎస్) ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా  ‘మీసేవ’ కేంద్రాల్లో  విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా వరంగల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ పరిధిలోని ఖమ్మం జిల్లాలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి మీసేవ కేంద్రంలో తనిఖీలు చేశారు.

News March 1, 2025

ఖమ్మం: వేసవి జాగ్రత్తల పట్ల ప్రజలకు వైద్య శాఖ సూచనలు

image

ఖమ్మం: సీజన్ మారే సమయంలో జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ ఎడ్యుకేటర్ అన్వర్ సూచించారు. వేడి గాలుల ప్రభావంతో వడదెబ్బ, అలసట, వికారం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ఉదయం 11 గంటల తర్వాత బయటకు వెళ్లకుండా గోరువెచ్చని నీరు, తేలికపాటి ఆహారం తీసుకోవాలని తెలిపారు.  

error: Content is protected !!