News October 7, 2024

మంత్రి నాదెండ్లను కలిసిన పౌరసరఫరాల శాఖ మెంబర్‌ మోకా

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ మెంబర్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ కో-కన్వీనర్ మోకా ఆనంద సాగర్ అమరావతిలోని సచివాలయం వద్ద రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదవి బాధ్యతలు చేపట్టిన మోకా ఆనంద్ సాగర్‌ను మంత్రి అభినందించారు. అదేవిధంగా ఆయనకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 12, 2025

తూ.గో: ఎక్కడ ఎన్ని ఇళ్లంటే..!

image

తూ.గో జిల్లాలో 8,773 ఇళ్లలో గృహప్రవేశాలు బుధవారం జరగనున్నాయి. పీఎంఏవై బీఎల్సీ పథకం కింద 7,200, పీఎంఏవై గ్రామీణ పథకం కింద 1,573 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశామని హౌసింగ్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాతి బుజ్జి తెలిపారు. రాజమండ్రిలో 375 ఇళ్లు, రాజానగరంలో 631, గోపాలపురంలో 1,760 ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామన్నారు.

News November 11, 2025

తూ.గో: హోం స్టే పెడితే రూ.5లక్షలు

image

తూ.గో జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో కనీసం ఓ గది నుంచి గరిష్ఠంగా 6గదులతో హోం స్టే ఏర్పాటు చేసుకోవచ్చని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ‘కొత్తగా పెట్టేవారికి స్వదేశ దర్శన్ పథకం కింద రూ.5 లక్షల ప్రోత్సాహకం ఇస్తాం. పాత హోమ్ స్టే పునరుద్ధరణకు రూ.3లక్షల వరకు సాయం చేస్తాం. 7ఏళ్లు 100 శాతం SGST తిరిగి చెల్లిస్తాం. మొదటి మూడేళ్లు రిజిస్ట్రేషన్ ఉచితం. యజమాని అదే ఏరియాలో ఉండాలి’ అని కలెక్టర్ చెప్పారు.

News November 11, 2025

రన్నర్‌గా తూ.గో జిల్లా అధికారులు

image

అనంతపురంలో ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్-2025 జరిగింది. ఇందులో తూ.గో జిల్లా రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రతిభ చూపారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కడియం తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్, రాజానగరం సీఎస్ డీటీ జి.బాపిరాజు జట్టు రన్నర్‌‌గా నిలిచారు. వాలీబాల్ విభాగంలో తూ.గో జట్టు రన్నర్‌‌గా నిలిచింది.