News September 19, 2024

మంత్రి నారాయణతో వైసీపీ కార్పొరేటర్లు భేటీ

image

నెల్లూరులోని వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. గురువారం ఉదయం నారాయణ సన్నిహితుడు విజయభాస్కర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో 15,16,47 డివిజన్ల వైసీపీ కార్పొరేటర్లు.. గణేశం వెంకటేశ్వర్లురెడ్డి, వేనాటి శ్రీకాంత్, రామకృష్ణ మంత్రి నారాయణతో భేటీ అయ్యారు. వీరు మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.

Similar News

News October 9, 2024

నెల్లూరు: క్రికెట్‌ ఆడటానికి వెళ్తూ యువకుడి మృతి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. గూడూరు నియోజకవర్గం కోట పట్టణానికి చెందిన ప్రసాద్ కుమారుడు కార్తిక్(19) తన స్నేహితుడితో కలిసి క్రికెట్ ఆడటానికి బైకుపై విద్యానగర్‌కు బయల్దేరాడు. ఈక్రమంలో HP పెట్రోల్ బంక్ వద్ద బైకు అదుపుతప్పి గోడను ఢీకొట్టడంతో తలకు పెద్ద గాయమైంది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.

News October 9, 2024

నెల్లూరు: నేటి నుంచి K.G రూ.50కే టమోటాలు

image

నెల్లూరు జిల్లా రైతుబజార్‌ల‌లో నేటి నుంచి కిలో రూ.50 చొప్పున సబ్సిడీపై టమోటాల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ అనితాకుమారి పేర్కొన్నారు. ప్రధానంగా నెల్లూరులోని పత్తేఖాన్ పేట, నవాబుపేట రైతుబజార్లో పాటు, కావలి, కందుకూరు, పొదలకూరు రైతుబజారులలో టమోటాలు విక్రయిస్తారన్నారు. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు తీసుకుని రావాలని, ఒకరికి రెండు కిలోలు మాత్రమే ఇస్తామన్నారు.

News October 9, 2024

నెల్లూరు జిల్లాలో త్వరలో ఎన్నికలు: కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో త్వరలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఒ.ఆనంద్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇరు శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేసి ఓటరు జాబితా తయారు చేయాలని కోరారు. రెవెన్యూలో ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్ల మంజూరు, మ్యూటేషన్‌ ట్రాన్సాక్షన్లపై తహశీల్దార్లు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.