News June 15, 2024

మంత్రి నారాయణను కలిసిన నెల్లూరు కలెక్టర్, ఎస్పీ

image

పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణను శనివారం నెల్లూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చింతా రెడ్డిపాలెంలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, శాంతిభద్రతలపై చర్చించారు.

Similar News

News September 20, 2024

28న నెల్లూరు జిల్లా విజయ డెయిరీ ఎన్నికలు

image

నెల్లూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి(విజయ డెయిరీ) ఎన్నికలను ఈనెల 28న నిర్వహించనున్నామని ఎన్నికల అధికారి హరిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 23న నామినేషన్ల స్వీకరణ, అదే రోజున పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీ గడువు. 28న ఓటింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం ఓట్లను లెక్కిస్తారు.

News September 20, 2024

NLR: రూ.2.16 కోట్లు కొట్టేసిన మేనేజర్..!

image

ఓ మేనేజర్ రూ.2.16 కోట్లు స్వాహా చేసిన ఘటన నాయుడుపేట మండలంలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. పండ్లూరు వద్ద వెయిట్ లెస్ బ్రిక్స్ పరిశ్రమలో మేనేజర్‌గా కాట్రగడ్డ సురేశ్ పనిచేస్తున్నారు. రెండేళ్లుగా నకిలీ బిల్లులు సృష్టించారు. ఇలా దాదాపు రూ.2.16 కోట్లు స్వాహా చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. మేనేజర్‌తో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిపై నాయుడుపేట సీఐ బాబి చీటింగ్ కేసు నమోదు చేశారు.

News September 20, 2024

నెల్లూరు: హెడ్ కానిస్టేబుల్ మృతి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఓ హెడ్ కానిస్టేబుల్ చనిపోయారు. నాగరాజు వెంకటగిరిలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలో ఆయన నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో గురువారం చనిపోయారని ఆయన కుటుంబీకులు తెలిపారు. వెంకటగిరి సీఐ ఏవీ రమణ, ఎస్ఐ సుబ్బారావు మృతుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.