News March 10, 2025
మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన బీద రవిచంద్ర

శాసనసభ్యుల కోటా నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన ఆ పార్టీ సీనియర్ నేత బీద రవిచంద్ర సోమవారం మర్యాద పూర్వకంగా మంత్రి లోకేశ్‌ను కలిశారు. ప్రజాసమస్యలను మండలి దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా రవిచంద్రకు లోకేశ్ అభినందనలు తెలిపారు.
Similar News
News March 10, 2025
రవిచంద్ర నామినేషన్‌లో ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యే కోటా శాసనమండలి సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఆయన వెంట ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాశం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, కావ్యా కృష్ణారెడ్డి ఉన్నారు.
News March 10, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 309 అర్జీలు

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు సమస్యలపై ప్రజలు అందిస్తున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 309 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అయన వెంట జాయింట్ కలెక్టర్ కార్తీక్, తదితరులు ఉన్నారు.
News March 10, 2025
పోలీస్ గ్రీవెన్స్‌కి 73 ఫిర్యాదులు: ఎస్పీ

నెల్లూరు ఉమేశ్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నిర్వహించారు. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించి వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రీవెన్స్ కి మొత్తం 73 ఫిర్యాదులు అందాయని ఎస్పీ చెప్పారు. ప్రతీ అర్జీని విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.