News March 9, 2025
మంత్రి నారా లోకేశ్ కదిరి పర్యటన వివరాలు

మంత్రి నారా లోకేశ్ కదిరి పర్యటన వివరాలను ఆయన కార్యాలయం విడుదల చేసింది. సోమవారం మధ్యాహ్నం 3:40 గంటలకు ఉండవల్లి నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 4:20 గంటలకు విమానంలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కదిరికి సాయంత్రం 6:15 గంటలకు వస్తారు. 9 గంటలకు నరసింహ స్వామికి వస్త్రాలు సమర్పించి, తిరిగి వెళ్తారు.
Similar News
News March 24, 2025
MMTSలో అత్యాచారయత్నం.. కిందకి దూకేసిన యువతి

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. MMTS రైలులో ప్రయాణిస్తున్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు ఆమె రైలు నుంచి కిందకి దూకడంతో తీవ్రంగా గాయపడింది. యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా కొంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. మహిళా బోగీలో యువతి ఒక్కరే ఉండటంతో నిందితుడు ఆమెపై అత్యాచారానికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
News March 24, 2025
మిస్ తెలుగు USA ఫైనలిస్ట్‌లో ఖమ్మం జిల్లా యువతి

మిస్ తెలుగు USA – 2025 పోటీల్లో బోనకల్ మం. ముష్టికుంట్లకు చెందిన యువతి గీతిక ఫైనల్స్‌కు చేరింది. అమెరికాలో స్థిరపడి చదువుకుంటున్న తెలుగు వారి కోసం ఈ పోటీలు నిర్వహిస్తారు. తెలుగుభాష గొప్పతనం, ఆత్మగౌరవం, సంస్కృతి తదితర అంశాలతో విజేతను ఎంపిక చేస్తారు. ఫినాలే మే25న డల్లాస్‌లో జరగనుండగా విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ముష్టికుంట్లకు చెందిన శివనర్సింహారావు-మాధవి దంపతుల కుమార్తె గీతిక.
News March 24, 2025
నరసరావుపేట: సబ్సిడీ రుణాల దరఖాస్తు గడువు పొడిగింపు

వివిధ రకాల కార్పొరేషన్ కింద స్వయం ఉపాధి రుణాల దరఖాస్తు గడువు పెంచినట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. 2024-25 సంవత్సరంలో బీసీ, కాపు, ఈ బీసీ, తదితర అన్ని కార్పొరేషన్‌కి సంబంధించిన సబ్సిడీ రుణం మంజూరు కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. B.C, E.W.Sలో ఉన్న ఏడు కార్పొరేషన్‌ల లబ్ధిదారుల కోసం స్వయం ఉపాధి పథకాల నమోదు ప్రక్రియ ఈనెల 25 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.