News July 11, 2024

మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ బ్లాక్

image

సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు hello.lokesh@ap.gov.in ఈ మెయిల్ ఐడీకి పంపాలని మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పంపుతున్న మెసేజ్‌లు పోటెత్తడంతో మంత్రి నారా లోకేశ్ వాట్సాప్‌ను మెటా బ్లాక్ చేసింది. తరచూ ఇదే సమస్య ఉత్పన్నం అవుతుండటంతో తన పర్సనల్ మెయిల్ ఐడీకి ప్రజలు తమ వినతులు, సమస్యలు పంపించాలని కోరారు.

Similar News

News February 17, 2025

GNT: కూలీల మృతిపై సీఎం చంద్రబాబు విచారం

image

గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో RTC బస్సు ఢీకొని ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు.

News February 17, 2025

తెనాలి: బంధువుల వివాహానికి వెళుతుండగా ప్రమాదం

image

తెనాలి మండలం కొలకలూరు రైల్వే స్టేషన్‌లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. తెనాలి సమీప గుడివాడకి చెందిన బొద్దులూరి పద్మావతి (55) ఆదివారం ఒంగోలులో బంధువుల వివాహానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కి వచ్చి ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. పట్టాలు దాటుతున్న పద్మావతిని చెన్నై వైపు వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో శరీరం నుంచి తలభాగం వేరుపడింది.

News February 17, 2025

నరసరావుపేట: ఈ కొండపై పెళ్లిళ్లు జరగవు

image

మహాశివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. పరమశివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఇదొక్కటే. ఇక్కడ మహా శివుడిని పూజిస్తే జాతకంలో గురు బలం పెరుగుతుందని భావిస్తారు. ఈ కారణంగా ఇతర గ్రహాల ప్రభావం పడకుండా రక్షణ పొందుతారు.

error: Content is protected !!