News February 7, 2025
మంత్రి నిమ్మలకు 22వ ర్యాంకు పట్ల ఆశ్చర్యం!

ఫైళ్ల క్లియరెన్స్‌పై CM చంద్రబాబు ప్రకటించిన ర్యాంకుల్లో నిమ్మల రామానాయుడికి 22వ ర్యాంకు లభించడం పట్ల ప.గో జిల్లా వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎప్పుడూ జలవనరుల శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో నిమ్మల చురుకుగా కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రాజెక్టులు, ఎత్తిపోతలు వంటి అంశాల్లో ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఫైళ్ల క్లియరెన్స్‌లో వెనకబడాల్సి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.
Similar News
News December 15, 2025
సామాన్యుల సమస్యల పట్ల అలసత్వం వద్దు: SP

పోలీస్ స్టేషన్లకు వచ్చే సామాన్య ప్రజల సమస్యల పట్ల స్పందించడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకూడదని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం గరగపర్రులోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టంలో ఆయన 11 అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.
News December 15, 2025
భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యులు పొట్టి శ్రీరాములు: కలెక్టర్

ఆంధ్రులకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవారు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి కలెక్టర్ నాగరాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యులు అయిన శ్రీరాములు ఆదర్శనీయులు, చిరస్మరణీయులని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ తదితర అధికారులు పాల్గొన్నారు.
News December 15, 2025
ఇంధన పొదుపు.. భవితకు మదుపు: కలెక్టర్

ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా భావితరాలకు వెలుగు నిద్దామని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా సోమవారం భీమవరం ప్రకాశం చౌక్‌లో విద్యుత్ ఉద్యోగులతో చేపట్టిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ప్రస్తుతం మనం విద్యుత్ వృథా చేస్తే భవిష్యత్ తరాలకు అంధకారాన్ని మిగిల్చిన వారమవుతామన్నారు. ఇంధన ప్రాముఖ్యతను ఆదా చేయాల్సిన విధానాలను కలెక్టర్ నాగరాణి వివరించారు.


