News February 7, 2025
మంత్రి నిమ్మలను కలిసిన ఇరికిపెంట మాజీ సర్పంచ్

సోమల మండలంలోని ఇరికిపెంట చిన్నపట్నం చెరువును అభివృద్ధి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడిని ఇరికిపెంట మాజీ సర్పంచ్ శ్రీనివాసులు నాయుడు కోరారు. గురువారం విజయవాడలో మంత్రిని కలిసిన ఆయన చెరువు కట్ట, తూములు, ఆయుకట్టు కాలువల అభివృద్ధికి చొరవ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు.
Similar News
News March 28, 2025
చిత్తూరు: బాలికపై అత్యాచారం.. వైసీపీ నేతకు రిమాండ్

బాలికపై అత్యాచారం చేసిన కేసులో నలుగురికి కోర్టు రిమాండ్ విధించింది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు(D)కు చెందిన ఓ బాలిక కలికిరి(M)లోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఇంటర్ చదువుతోంది. ఈ ఏడాది జనవరి 25న బాలిక కనపడలేదు. YCP నేత అహ్మద్ పెద్ద కొడుకు జునేద్ అహ్మద్ తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది. కాగా నిందితుడు పరారీలో ఉన్నాడు.
News March 28, 2025
ఆర్మీలో ఉద్యోగావకాశాలు: చిత్తూరు కలెక్టర్

ఆర్మీలో ఉద్యోగాలపై చిత్తూరు కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. గుంటూరులో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు మార్చి 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుకు ఏప్రిల్ 10 చివరి తేదని కలెక్టర్ వెల్లడించారు.
News March 28, 2025
చిత్తూరు: ఖాళీ స్థానాలకు ఎన్నికలు

చిత్తూరు జిల్లాలో మండల పరిషత్‌లో ఖాళీగా ఉన్న స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. సదుం ఎంపీపీగా మాధవి, పెనుమూరు కో-ఆప్షన్ సభ్యురాలిగా నసీమా, రామకుప్పం ఎంపీపీగా సులోచనమ్మ, వైఎస్ ఎంపీపీగా వెంకటే గౌడ, విజయపురం వైస్ ఎంపీపీగా కన్నెమ్మ, తవణంపల్లి ఎంపీపీగా ప్రతాప్ సుందర్ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.