News September 28, 2024

మంత్రి నిమ్మలను కలిసిన ఏపీఐఐసీ ఛైర్మన్ రామరాజు

image

పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడును ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమితులైన ఉండి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లాధ్యక్షుడు మంతెన రామరాజు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామరాజును మంత్రి శాలువ కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. రామరాజు వెంట ఉండి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఉన్నారు.

Similar News

News December 21, 2025

ఈనెల 22న వీరవాసరంలో జిల్లాస్థాయి సైన్ ఫెయిర్

image

ఈ నెల 22న వీరవాసరం ఎంఆర్‌కె జడ్పీ హైస్కూల్‌లో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు డీఈవో నారాయణ తెలిపారు. ఈ సైన్స్ ఫెయిర్లో పాఠశాలల నుంచి మండల స్థాయికి ఎంపికైన, మండల స్థాయిలో ఉత్తమంగా ఎంపికైన సైన్స్ ప్రదర్శనలు ప్రదర్శిస్తారన్నారు. జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌కి ఎంపికైన ఎగ్జిబిట్స్ ముందు రోజే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు.

News December 21, 2025

తాడేపల్లిగూడెం: మోపెడ్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

image

పెదతాడేపల్లి సమీపంలోని వెల్లమిల్లి స్టేజ్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిపూడి పెద్దిరాజు మృతి చెందారు. వెల్లమిల్లిలో పని ముగించుకుని కొమ్ముగూడెం వెళ్తుండగా, అతివేగంగా వచ్చిన లారీ వీరి మోపెడ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పెద్దిరాజు గాయాలతో చికిత్స పొందుతూ కన్నుమూయగా, మోపెడ్ నడుపుతున్న చెల్లయ్య తలకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 21, 2025

భీమవరం: నేడే పల్స్ పోలియో

image

పశ్చిమ గోదావరి జిల్లాను పోలియో రహితంగా మార్చేందుకు తల్లిదండ్రులు సహకరించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ గీతాబాయి విజ్ఞప్తి చేశారు. ఆదివారం జరిగే పల్స్ పోలియో శిబిరాల్లో 0-5 ఏళ్ల పిల్లలకు తప్పనిసరిగా చుక్కలు వేయించాలన్నారు. శనివారం భీమవరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.