News December 11, 2024
మంత్రి పదవిపై ఐలయ్య రెస్పాన్స్

ఐలయ్యకు మంత్రి పదవి అని వస్తున్న కథనాలపై ఆయన స్పందించారు. బీసీ కోటాలో పరిగణనలోకి తీసుకొని తనకు మంత్రి పదవి ఇస్తారనని భావిస్తున్నట్లు MLA ఐలయ్య చెప్పారు. అయితే తాను కాంగ్రెస్కు విధేయుడనని, పార్టీ చెప్పింది చేయడమే తన పని అని చెప్పారు. తనకు ఇప్పటికే క్యాబినెట్ ర్యాంక్ కలిగిన ప్రభుత్వ విప్ ఇచ్చారని, మంత్రి పదవి ఇచ్చినా.. ఇవ్వకున్నా బాధేమీ ఉండదని చెప్పారు.
Similar News
News November 18, 2025
చిత్తడి నేలల గుర్తింపు పూర్తి చేయాలి: కలెక్టర్

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపు కార్యక్రమాన్ని శనివారం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా చిత్తడి నేలల సంరక్షణ, నిర్వహణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చిత్తడి నేలల గుర్తింపును పూర్తి చేయాలని అన్నారు.
News November 18, 2025
స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌గా డా. కె.అరుణప్రియ

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌గా డా కె.అరుణప్రియను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. డా.కె అరుణప్రియ ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌గా ఏడాది కాలం పాటు సేవలందించనున్నారు. ఈ సందర్భంగా అరుణప్రియను అధికారులు, విద్యార్థులు అభినందించారు.
News November 18, 2025
నల్గొండను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలి

నషాముక్త భారత్ కార్యక్రమం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చే దిశగా ప్రతి విద్యా సంస్థ కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఐదో వార్షికోత్సవం నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటానని అందరూ ప్రతిజ్ఞ చేయాలని తెలిపారు.


