News December 20, 2024
మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి కామెంట్స్

మంత్రి పదవిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులపై ఆశ లేదని రావాల్సిన టైంలో మంత్రి పదవి వస్తుందన్నారు. ఇప్పటివరకు ఏ పదవులు అడగలేదని.. పార్టీ కోసం కష్టపడే వారికి అధిష్ఠానం పదవులు ఇస్తుందన్నారు. ఏ డ్రెస్సులు వేసుకున్నా ఆఖరికి బీఆర్ఎస్ నేతలకు జైలు డ్రెస్సే గతి అంటూ ఎద్దేవా చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు.
Similar News
News November 19, 2025
ముగిసిన కోట మైసమ్మ ఆలయ జాతర

నిడమనూరు మండల పరిధిలోని కోట మైసమ్మ ఆలయ జాతర మంగళవారం ముగిసింది. మూడో రోజు సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహించారు. అంతకముందు భక్తులు బోనాలు సమర్పించారు. జిల్లా నుంచే కాకుండా మహబూబ్నగర్, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చినట్లు ఈవో సిరికొండ నవీన్ కుమార్ తెలిపారు.
News November 19, 2025
జాతీయ జల అవార్డు అందుకున్న నల్గొండ జిల్లా

జల్ సంజయ్ & జన్ భగీదరి కార్యక్రమంలో దేశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా నల్గొండ ద్వితీయ స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి 6వ జాతీయ జల అవార్డు (రూ.2 కోట్ల ప్రైజ్ మనీ, ప్రశంసా పత్రం)ను అందుకున్నారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.
News November 19, 2025
నల్గొండ: బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్

2025 -26 విద్యా సంవత్సరానికి గాను ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల నమోదు కోసం జిల్లాలోని GHS, ZPHS, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో 9 10వ తరగతి చదువుతున్న అర్హులైన BC, EBC విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజకుమార్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు DEC 15 లోపు https://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.


