News December 20, 2024
మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి కామెంట్స్
మంత్రి పదవిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులపై ఆశ లేదని రావాల్సిన టైంలో మంత్రి పదవి వస్తుందన్నారు. ఇప్పటివరకు ఏ పదవులు అడగలేదని.. పార్టీ కోసం కష్టపడే వారికి అధిష్ఠానం పదవులు ఇస్తుందన్నారు. ఏ డ్రెస్సులు వేసుకున్నా ఆఖరికి బీఆర్ఎస్ నేతలకు జైలు డ్రెస్సే గతి అంటూ ఎద్దేవా చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు.
Similar News
News January 24, 2025
చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన DSP
ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు చెరువుగట్టులో శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ DSP కె. శివరాంరెడ్డి నార్కట్‌పల్లి సీఐ నాగరాజుతో కలిసి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. దేవాలయ పరిసర ప్రాంతాలు, భక్తుల సౌకర్యం, పార్కింగ్ ప్రదేశాలను సందర్శించి పలు సూచనలు చేశారు. దేవాలయ EO నవీన్ కుమార్ నార్కెట్ పల్లి పోలీస్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News January 23, 2025
నల్లగొండ: పరీక్షలు వాయిదా వేయాలని వినతిపత్రం
జనవరి 30 నుంచి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరగనున్న LLB మూడు, ఐదు సంవత్సరాల మొదటి సంవత్సర మొదటి సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని NSUI అధ్యక్షుడు సర్దార్ నాయక్ ఆధ్వర్యంలో COEకి వినతిపత్రం అందజేశారు. మొదటి సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్స్ ప్రక్రియ ఆలస్యమైన కారణంగా పూర్తిస్థాయిలో సిలబస్ పూర్తి కాలేదన్నారు. ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి తక్కువ సమయం ఉన్నందున విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారని తెలిపారు.
News January 23, 2025
NLG: నేటి నుంచి జాన్ పహాడ్ దర్గా ఉర్సు
సూర్యాపేట జిల్లాలో జాన్ పహాడ్ దర్గా ఉర్సు నేటి నుంచి 25వ తేదీ వరకు జరగనుంది. మూడు రోజులపాటు నేరేడుచర్ల నుంచి జాన్ పహాడ్ వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దలకు ఛార్జీ రూ.40, పిల్లలకు రూ.20గా నిర్ణయించామన్నారు. నల్గొండ, మిర్యాలగూడెం నుంచి వచ్చే వారికి ఈ సర్వీసులు ఉపయోగపడనున్నాయి.