News February 6, 2025

మంత్రి పయ్యావులకు సీఎం ర్యాంక్

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో పనితీరు ఆధారంగా సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో అనంతపురం జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ 24వ ర్యాంక్ సాధించారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.

Similar News

News March 19, 2025

10th విద్యార్థులకు ఇబ్బందులు కలగొద్దు: కలెక్టర్

image

అనంతపురంలోని రాంనగర్ పరిధిలో ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూలులో పదో తరగతి పరీక్షలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News March 19, 2025

హిందూపురం వ్యక్తి దారుణ హత్య

image

శ్రీ సత్యసాయి జిల్లా మలుగూరు సమీపంలో హిందూపురానికి చెందిన సద్దాం(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగగా.. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హిందూపురం రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News March 19, 2025

ఆటో ప్రమాదంలో ఒకరు మృతి

image

తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నె వద్ద జరిగిన ఆటో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తాడిపత్రిలోని శ్రీనివాసపురానికి చెందిన రసూల్ బేగం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నంద్యాల జిల్లా పేరు సోమల గ్రామానికి మిర్చి కోసేందుకు వెళ్లి వస్తున్న సందర్భంలో ఆటో బోల్తా పడటంతో మృతి చెందింది.

error: Content is protected !!