News October 31, 2024
మంత్రి పొంగులేటి దీపావళి శుభాకాంక్షలు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత పది ఏళ్ల విధ్వంసపు పాలనలో చీకట్లు తొలగిపోయాయని.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రజాపాలనలో తెలంగాణ సంతోషంగా ఉందని తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించకుండా చిన్న పెద్దలందరూ పండుగ జరుపుకోవాలని.. ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని పొంగులేటి విజ్ఞప్తి చేశారు.
Similar News
News October 31, 2024
భద్రాచలం వద్ద గోదావరి నదిలో వ్యక్తి గల్లంతు
భద్రాచలంలో గోదావరి ఘాట్ వద్ద పండగ పూట విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరానికి చెందిన చలపతి(25) తన ఇద్దరు స్నేహితులతో కలిసి గురువారం భద్రాచలం గోదావరి నది వద్ద స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతయ్యాడు. గల్లంతైన చలపతితో పాటు ఇద్దరు స్నేహితులు గోదావరిలో కొట్టుకొని పోతుండగా ఫోటోగ్రాఫర్లు ఇద్దరిని రక్షించారు.
News October 31, 2024
KMM: తల్లితో వివాహేతర సంబంధం.. కూతురితో అసభ్య ప్రవర్తన
హైదరాబాద్లో దారుణం జరిగింది. పోలీసుల వివరాలు.. ఖమ్మం నుంచి ఓ మహిళ భర్త, కుమార్తెతో పాటు నగరానికి వచ్చింది. ఈమెకు అస్లాం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అంతే కాకుండా కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News October 31, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 4 రోజులు సెలవు
నేటి నుంచి ఆదివారం వరకు 4 రోజుల పాటు ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ వర్గాలు తెలిపాయి. ఈనెల 31న దీపావళి, వచ్చేనెల 1న అమావాస్య, 2వ తేదీన శనివారం వారాంతపు సెలవు, 3న ఆదివారం సాధారణ సెలవుగా ప్రకటించినట్లు వెల్లడించారు. తిరిగి సోమవారం నుంచి మార్కెట్ కార్యకలాపాలు మొదలవుతాయనే విషయాన్ని రైతులు గమనించాలని సూచించారు.