News March 22, 2025

మంత్రి పొన్నంను కలిసిన కరీంనగర్ సీపీ

image

కరీంనగర్ సీపీగా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన గౌస్ అలం రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం మంత్రిని సీపీ కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలు, ప్రజా భద్రతల రక్షణ దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను గురించి వారు చర్చించారు.

Similar News

News December 20, 2025

KNR: ఎన్నికల విధులకు గైర్హాజరు.. 713 మందికి నోటీసులు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 713 మంది ఉద్యోగులకు కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి అశ్విని తానాజీ వాకడే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు విడతల్లో జరిగిన పోలింగ్‌కు పీఓ, ఏపీఓలుగా నియామకమైనా, ముందస్తు అనుమతి లేకుండా వీరు విధులకు రాలేదని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

News December 20, 2025

KNR: ఓవర్సీస్ స్కాలర్ షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని మైనారీటీ విద్యార్థులు విదేశాల్లో విద్య నభ్యసించేందుకు 2025 ఓవర్సీస్ స్కాలర్ షిప్‌కు దరఖాస్తులు చేసుకోవాలని సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పీజీ, పిహెచ్‌డి చేయుటకు జనవరి 19 లోగా వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు ఫిబ్రవరి 20 వరకు కరీంనగర్ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 87829 57085 నంబర్ సంప్రదించాలని కోరారు.

News December 20, 2025

విద్యార్థులందరికీ దంత పరీక్షలు: కలెక్టర్ పమేలా సత్పతి

image

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులెవరూ దంత సమస్యలతో బాధపడకూడదని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ ప్రధాన ఆస్పత్రిలో విద్యార్థుల చికిత్స తీరును ఆమె పరిశీలించారు. ఇప్పటివరకు 12 వేల మందికి పరీక్షలు నిర్వహించి, 1500 మంది బాధితులను గుర్తించినట్లు తెలిపారు. ఈనెల 23లోగా తొలి విడత పూర్తి చేసి, జనవరి 1 నుండి రెండో విడత శిబిరాలు ప్రారంభించాలని వైద్యులకు సూచించారు.