News December 9, 2024
మంత్రి పొన్నంను కలిసిన బిగ్ బాస్ సీజన్-8 ఫేమ్ సోనియా
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గానికి చెందిన ఆకుల సోనియా ఇటీవల బిగ్‌బాస్ సీజన్-8కి వెళ్లి వచ్చింది. కాగా, నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సోనియా మర్యాదపూర్వంగా కలిశారు. తన వివాహానికి హాజరుకావాలని కాబోయే భర్తతో కలిసి మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు, తదితరులు ఉన్నారు.
Similar News
News December 27, 2024
వేములవాడ: గోవులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్
రాజన్న గోవులపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వేములవాడ మండలం తిప్పాపూర్‌లోని గోశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. గోశాలలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సివిల్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గోవుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు.
News December 27, 2024
మన్మోహన్ సింగ్‌తో జ్ఞాపకాన్ని పంచుకున్న మాజీ మంత్రి
భారతదేశ ఆర్థిక సంస్కరణలకు దూరదృష్టి గల నాయకుడు మన్మోహన్ సింగ్ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా వారి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి వారు చేసిన సేవలు తరతరాలు గుర్తుండి పోతాయన్నారు. గతంలో వారితో కలిసిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా మాజీ మంత్రి పంచుకున్నారు.
News December 27, 2024
KNR: నేడు జరిగే సెమిస్టర్ పరీక్ష వాయిదా!
KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించగా నేటి సెమిస్టరు పరీక్షను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. రేపటి నుంచి జరగాల్సిన యూనివర్సిటీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయాన్నారు. కాగా, నేటి పరీక్ష నిర్వహణ మళ్లీ ఎప్పుడు అనేది ప్రకటిస్తామన్నారు.