News November 27, 2024
మంత్రి ఫరూక్‌ను సత్కరించిన న్యాయవాదులు
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను బుధవారం నంద్యాల తెలుగుదేశం పార్టీ ఎన్నికల సెల్ విభాగం న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని గుర్తుచేశారు. ప్రత్యేకించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసినందుకు కృషి చేస్తున్నారన్నారు.
Similar News
News December 2, 2024
నంద్యాల వద్ద రైలు ఢీకొని విద్యార్థి మృతి
రైలు ఢీకొని విద్యార్థి మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న సతీశ్ అనే యువకుడు సోమవారం బొమ్మల సత్రం రైల్వే ట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో రైలు ఢీకొనడంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 2, 2024
ప్రేమ పేరుతో మోసం.. ఆదోనిలో ప్రియుడి కుటుంబంపై కేసు
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై ఆదోనిలో కేసు నమోదైంది. సీఐ శ్రీరామ్ వివరాల మేరకు.. ఆదోనికి చెందిన గురుప్రసాద్ బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. మైసూరు యువతి చందన పరిచయమైంది. ఇరువురూ ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులతో చర్చల తర్వాత యువకుడు పెళ్లికి నిరాకరించారు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియుడితోపాటు కుటుంబ సభ్యులపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
News December 1, 2024
గోనెగండ్ల: చీరకు నిప్పు.. చికిత్స పొందుతూ మహిళ మృతి
గోనెగండ్లకు చెందిన సుంకులమ్మ (81) అనే మహిళ కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందిందని సీఐ గంగాధర్ తెలిపారు. సీఐ వివరాల మేరకు.. ఎస్సీ కాలనీలో ఉండే సుంకులమ్మ నవంబర్ 28న వేడి నీళ్ల కోసం పొయ్యి దగ్గరకు వెళ్లగా చీరకు నిప్పు అంటుకొని మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పేర్కొన్నారు. కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసామన్నారు.