News March 21, 2025
మంత్రి ఫరూక్ సతీమణి మృతి బాధాకరం: నంద్యాల ఎంపీ

న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ సతీమణి మృతి చాలా బాధిస్తోందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఫరూక్ సతీమణి షహనాజ్ అకాల మరణం వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని శబరి పేర్కొన్నారు. మంత్రి కుటుంబానికి అల్లా తోడుగా ఉండాలని ఎంపీ శబరి తెలిపారు.
Similar News
News November 22, 2025
ఇంద్రకీలాద్రిపై గురు భవానీల పేరుతో దందా..!

ఇంద్రకీలాద్రిపై వచ్చేనెల 11-15వ తేదీ వరకు భవాని మాల విరమణకు భక్తులు రానున్నారు. కాగా ఇప్పటినుంచే ఆలయాన్ని తమ పరిధిలోకి తెచ్చుకోవాలని గురుస్వాముల ముసుగులో కొందరు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏటా మాలవిరమణ సమయంలో వీరిదందా ఎక్కువగా ఉంటోంది. మాల విరమణ, ఇరుముడి తీసేహక్కు లేకున్నా ఆ ఇరుముడిలో వచ్చే నగదుకై 5 రోజుల్లోనే రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు కట్టడి చేయాలని భవానీలు కోరుతున్నారు.
News November 22, 2025
SKLM: ఆర్టీసీ ఆధ్వర్యంలో పార్సిల్ సర్వీసులు బేష్

శ్రీకాకుళం జిల్లా RTC సంస్థ ఆధ్వర్యంలో పార్సిల్ సర్వీస్ సేవలు భేష్ అని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ పేర్కొన్నారు. సేవలందించిన రెండు ఏజెన్సీలు నిర్వాహకులను శనివారం స్థానిక కాంప్లెక్స్లో ఆయన అభినందించారు. ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ప్రజలకు సంబంధించిన వివిధ రకాల పార్సిల్లను ఎంత దూరమైన అందించే సేవలో ఆర్టీసీ పనిచేస్తుందన్నారు. DMలు నరసింహుడు, శర్మ, ఎంపీరావు పాల్గొన్నారు.
News November 22, 2025
డ్రగ్స్-టెర్రర్ లింక్ను నాశనం చేయాలి: మోదీ

డ్రగ్స్-ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలు కలిసిరావాలని జీ20 సమ్మిట్లో PM మోదీ పిలుపునిచ్చారు. SAలోని జొహనెస్బర్గ్లో జరుగుతున్న సదస్సులో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను సవాలుగా తీసుకోవాలన్నారు. అత్యంత ప్రమాదకరమైన ఫెంటానిల్ వంటి వాటి వ్యాప్తిని అరికట్టడం, డ్రగ్స్-టెర్రర్ సంబంధాలను ఎదుర్కొనేందుకు సహకరించుకోవాలని ప్రతిపాదించారు. ఉగ్రవాద ఆర్థిక మూలాలను బలహీనపర్చేందుకు కృషి చేయాలన్నారు.


