News March 21, 2025
మంత్రి ఫరూక్ సతీమణి మృతిపై నారా లోకేశ్ దిగ్భ్రాంతి

న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షహనాజ్ మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. ‘మంత్రి ఫరూక్ సతీమణి షహనాజ్ పవిత్ర రంజాన్ మాసంలో ఇంతిఖాల్ అయ్యారు. ఆమెకు జన్నత్‌లో ఉన్నతమైన స్థానం ప్రసాదించాలని, ఆత్మకు శాంతి కలగాలని అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’ అని ‘X’లో ట్వీట్ చేశారు.
Similar News
News December 9, 2025
తొలి విడత ఎన్నికలకు భారీ భద్రత: ఖమ్మం సీపీ

మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ నెల 11న జరిగే ఎన్నిక కోసం 2 వేల మంది సిబ్బందితో పహారా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 953కేసుల్లో 6,403 మందిని బైండోవర్ చేశామన్నారు. రూ.12 లక్షల విలువైన 1,200 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. 16 సరిహద్దు చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు చేపడుతున్నామని కమిషనర్ వివరించారు.
News December 9, 2025
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికలు మొదటి విడతలో రేగోడ్, హవేలి ఘణపూర్, టేక్మాల్, అల్లాదుర్గ్, పాపన్నపేట్, పెద్దశంకరంపేట్ మండలాల్లో 11న జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయని తెలిపారు.
News December 9, 2025
HURLలో అప్రెంటిస్ పోస్టులు

హిందుస్థాన్ ఉర్వరిక్ రసాయన్ లిమిటెడ్ (<


