News July 16, 2024
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో సవిత భేటీ
రాష్ట్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత మంగళవారం వెలగపూడి సచివాలయంలో భేటీ అయ్యారు. పెనుకొండ నియోజకవర్గంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. చాలా గ్రామాలకు అంతర్గత రోడ్లు లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. సీసీ రోడ్లు గ్రామాల నుంచి గ్రామాలకు కనెక్టివిటీగా బీటీ రోడ్లు వేయాలని కోరారు.
Similar News
News October 11, 2024
బోనం సమర్పించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
దసరా నవరాత్రుల సందర్భంగా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అత్యంత భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించారు. బుక్కరాయసముద్రంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బోనం సమర్పించి, పూజా కార్యక్రమం నిర్వహించారు. మొక్కును చెల్లించుకున్నారు. నియోజకవర్గంలో పంటలు పుష్కలంగా పండి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.
News October 11, 2024
హిందూపురం ప్రభుత్వ టీచర్‌కు 6 నెలల జైలు శిక్ష
హిందూపురానికి చెందిన ఓ మహిళా ఉపాధ్యాయినికి చెక్ బౌన్స్ కేసులో పెనుకొండ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. పోలీసుల వివరాల మేరకు.. 2022లో గుట్టూరుకు చెందిన ఈశ్వరమ్మకు హిందూపురానికి చెందిన ఓ ఉపాధ్యాయిని డబ్బు ఇవ్వాల్సి ఉండగా చెక్ ఇచ్చింది. అది బౌన్స్ కావడంతో కొంతకాలం తర్వాత ఈశ్వరమ్మ కోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా గురువారం కోర్టు తీర్పు వెల్లడించింది.
News October 11, 2024
దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి: కలెక్టర్
చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్కరి కుటుంబానికి విజయాలు వరించాలన్నారు. జిల్లా ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలను మంత్రి తెలిపారు.