News December 18, 2024
మంత్రి బీసీ మరో కీలక నిర్ణయం!
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ తనను కలిసేందుకు వచ్చేవారు నోట్ పుస్తకాలు, పెన్నులు మాత్రమే తీసుకురావాలని ఇప్పటికే సూచించారు. ఇప్పుడు ఆ వేడుకలకు సంబంధించి ఎలాంటి బ్యానర్లు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని తన అభిమానులకు తెలియజేశారు. బనగానపల్లెను ప్లాస్టిక్ రహిత, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
Similar News
News January 18, 2025
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్
ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా పిలుపునిచ్చారు. శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంలో భాగంగా గూడూరు మండల కేంద్రంలోని అన్న క్యాంటీన్ ప్రాంగణంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం అన్న క్యాంటీన్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు.
News January 18, 2025
మంత్రి ఫరూక్‌పై సీఎం అసంతృప్తి!
మంత్రులు, ఎంపీలతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు వారి పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. సోషల్ మీడియాను వినియోగించుకోవడంలోనూ మార్కులు ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంలో మంత్రి ఫరూక్ వెనుకబడ్డారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా పీఆర్వో, ఉద్యోగులను ఇచ్చినా చివరిస్థానంలో నిలవడం సరికాదరి, ఈసారి ర్యాంకు మెరుగవ్వాలని సూచించారు.
News January 18, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ విజేత వైజాగ్ జట్టు
శ్రీశైల మండల కేంద్రమైన సున్నిపెంటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో వైజాగ్ జట్టు విజేతగా నిలిచింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సున్నిపెంట యూత్ ఆధ్వర్యంలో సెంట్రల్ లొకాలిటీ పాఠశాలలో 4 రోజులుగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. రన్నర్‌గా గంగావతి టీమ్, 3వ స్థానంలో కర్నూలు, 4వ స్థానంలో అనంతపురం టీంలు నిలిచాయి. ఆ జట్లకు నిర్వాహకులు నగదుతో పాటు కప్పులను అందజేశారు.