News September 18, 2024

మంత్రి మండలి సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారంపై మాట్లాడారు. అదేవిధంగా వివిధ శాఖలకు చెందిన మంత్రులు, అధికారులు, ఈ మంత్రి మండలి సమావేశంలో పాల్గొన్నారు.

Similar News

News October 13, 2025

భీమవరం: నేటి పీజీఆర్ఎస్‌కు 95 అర్జీలు

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 95 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News October 13, 2025

తణుకు: గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

image

తణుకు మండలం పైడిపర్రు కాలువలో పడి గల్లంతైన బొమ్మనబోయిన జోగేంద్ర (13) మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. జోగేంద్ర తన స్నేహితులతో కలిసి ఆడుకుందామని వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. అత్తిలి మండలం గుమ్మంపాడు సమీపంలో కాలువలో బాలుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News October 13, 2025

ఈనెల 17న తణుకులో జిల్లా యువజనోత్సవాలు: కలెక్టర్

image

ఈనెల 17న తణుకులో జిల్లా యువజనోత్సవాలు జరుగుతాయని, పోటీల్లో పాల్గొనేందుకు 15 నుంచి 29 ఏళ్ల యువకులు అర్హులని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలు నవంబర్ 2025లో విజయవాడలో జరుగుతాయని, జాతీయస్థాయి పోటీలు జనవరి 2026 ఢిల్లీలో జరుగుతాయన్నారు. దీనిలో భాగంగా ఈనెల15న భీమవరం ఎస్ఆర్ కేఆర్‌లో ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.