News August 27, 2024
‘మంత్రి మనోహర్ రేషన్ మాఫియాకు వణుకు పుట్టించారు’
పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ రేషన్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. తెనాలి జనసేన కార్యాలయంలో సోమవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. కాకినాడ పోర్టు సాక్షిగా మంత్రి మాఫియాకి వణుకు పుట్టించారు అని అన్నారు.
Similar News
News September 13, 2024
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.4 కోట్ల విరాళం
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు భాష్యం విద్యాసంస్థలు తమవంతు సహకారాన్ని అందించాయి. రూ.4 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి శుక్రవారం సచివాలయంలో చందబ్రాబును కలిసి అందించారు. భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ రామకృష్ణ, డైరెక్టర్ హనుమంతరావు, రామకృష్ణ తనయుడు సాకేత్ రామ్ చెక్కు అందజేసిన వారిలో ఉన్నారు.
News September 13, 2024
ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం
రాష్ట్ర సచివాలయంలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి, తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ తులసి రామచంద్ర ప్రభు, ఎండీ తులసి యోగిశ్ చంద్ర కోటి రూపాయల చెక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందజేశారు. దీంతో పాటు తులసి గ్రూప్ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.5.43 లక్షలను సంస్థ జనరల్ మేనేజర్ పచ్చా వాసుదేవ్, చంద్రబాబుకు అందజేశారు.
News September 13, 2024
మంగళగిరి: టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
వైసీపీ నాయకులు పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నర్సింహారావు ఉండవల్లిలోని నివాసంలో శుక్రవారం మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారితో పాటు 7వ వార్డు కౌన్సిలర్ సీతారావమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు, తదితరులు పార్టీలో చేరారు.