News July 12, 2024
మంత్రి లోకేశ్‌ను కలిసిన పత్తికొండ ఎమ్మెల్యే

మంత్రి నారా లోకేశ్‌ను టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు తిక్కారెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ గురువారం కలిశారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం నియోజకవర్గంలో జరిగిన పరిణామాలను లోకేశ్‌కు వివరించారు. టీడీపీ నాయకుడి హత్య అనంతరం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారాయుడుకు వైసీపీ నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని శ్యామ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News October 28, 2025
కర్నూలు: ‘ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు’

ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ చేసినా ఉపేక్షించమని మంగళవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కేఎంసీలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత కలవారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ, సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, సాయి సుధీర్, రేణుక దేవి, సీఐ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
News October 28, 2025
కర్నూలు: గృహ నిర్మాణంపై చర్చించిన హౌసింగ్ డైరెక్టర్

కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన ఆరేకల్ రామకృష్ణ మంగళవారం హౌసింగ్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇద్దరూ జిల్లా గృహ నిర్మాణ ప్రగతిపై, అలాగే 2014–2019 మధ్య పెండింగ్‌లో ఉన్న హౌసింగ్ బిల్లుల పరిష్కారం వంటి అంశాలపై విశదంగా చర్చించారు.