News October 11, 2024

మంత్రి లోకేశ్‌ను కలిసిన ఎమ్మెల్యే గంటా

image

విశాఖపట్నంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ రావడానికి మంత్రి లోకేశ్ కృషి చేశారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన్ను కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ కంపెనీ ద్వారా పదివేల మందికి ఉపాధి అవకాశం దొరుకుతుందని, విద్యా, ఫార్మా, టూరిజం వంటి అభివృద్ధి చెందుతాయన్నారు. నగరంలో మెట్రో ఏర్పడే సమయాని ఫ్లైఓవర్లు, కారిడార్లు వంటి వాటిపై దృష్టి సారించాలని మంత్రిని గంటా కోరారు.

Similar News

News October 12, 2024

విశాఖ: ఓపెన్ యూనివర్సిటీ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 3వ సంవత్సరం 6వ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 27 కు వాయిదా వేసినట్లు డాక్టర్ విఎస్ కృష్ణ కళాశాల అధ్యయన కేంద్రం రీజినల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ తెలిపారు. ఈనెల 14న జరగాల్సిన పరీక్షలను నాక్ బృందం సందర్శన కారణంగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి 27 నుంచి జరిగే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

News October 12, 2024

సింహాద్రి అప్పన్న జమ్మి వేట ఉత్సవానికి ఏర్పాట్లు

image

విజయదశమి సందర్భంగా ఈనెల 13న సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో జమ్మి వేట ఉత్సవం నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువన పూల తోటలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సింహాద్రి అప్పన్నను శ్రీరాముడిగా అలంకరించి సాయంత్రం పల్లకిలో కొండదిగువకి తీసుకువస్తారు. శమీ వృక్షానికి పూజ చేసి జమ్మి వేట ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల వరకే స్వామి దర్శనాలు లభిస్తాయని అధికారులు తెలిపారు.

News October 12, 2024

విశాఖ పోర్టును సందర్శించిన ఆస్ట్రేలియా బృందం

image

విశాఖ పోర్టును ఆస్ట్రేలియా బృందం శుక్రవారం సందర్శించింది. పోర్టు డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్ కుమార్ దుబే వారికి స్వాగతం పలికారు. పోర్టులో ఉన్న సౌకర్యాలు, అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బృందానికి వివరించారు. ఈ బృందంలో ఆస్ట్రేలియా డిప్యూటీ కాన్సులేట్ జనరల్ డేవిడ్ ఎగుల్స్ టన్, హై కమిషన్ ఫస్ట్ సెక్రటరీ గ్రేస్ విలియమ్స్ ఉన్నారు.