News January 29, 2025

మంత్రి లోకేశ్‌ను కలిసిన ఎమ్మెల్యే బుడ్డా

image

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి లోకేశ్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శ్రీశైలం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి పాల్గొన్నారు.

Similar News

News December 16, 2025

నేడు వర్షాలు!

image

AP: రాయలసీమ జిల్లాలను మళ్లీ వర్షాలు పలకరించనున్నాయి. బంగాళాఖాతం నుంచి తూర్పు గాలులు వీస్తుండటంతో తమిళనాడును ఆనుకొని ఉన్న రాయలసీమలో ఇవాళ అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. అటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగుతోంది. నిన్న అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు(M) కిలగాడలో 7.3డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో COMMENT చేయండి.

News December 16, 2025

తిరుప్పావై కీర్తనలు ఆలపించే పద్ధతి

image

ధనుర్మాసంలో తిరుప్పావై పాశురాలను ఆలపిస్తే సుగుణాల భర్త వస్తాడని నమ్ముతారు. అయితే మొత్తం 30 పాశురాలు ఉంటాయి. రోజుకొకటి చొప్పున 30 రోజుల పాటు 30 పాశురాలను ఆలపించాలి. ఉదయాన్నే స్నానమాచరించి లక్ష్మీనారాయణులను పూజించాక ఈ పాశురాలను ఆలపించాలి. గోదాదేవి శ్రీకృష్ణుడిని మేల్కొలపడానికి తన చెలులతో కలిసి వీటిని ఆలపించింది. ధనుర్మాసంలో తిరుమలలో సుప్రభాతం బదులుగా తిరుప్పావై కీర్తనలే ఆలపిస్తారు.

News December 16, 2025

లంపీస్కిన్ నివారణకు మరో ఆయుర్వేద మందు

image

ఆయుర్వేద మందుతో <<18552983>>లంపీస్కిన్<<>> నుంచి పశువును కాపాడవచ్చు. రెండు వెల్లులి రెబ్బలు, 10గ్రా. ధనియాలు, 10గ్రా. జీలకర్ర, గుప్పెడు తులసి ఆకులు, 10గ్రా. బిర్యానీ ఆకులు, 10గ్రా. మిరియాలు, 5 తమలపాకులు, రెండు ఉల్లిపాయలు, 10 గ్రా. పసుపు, 10గ్రాముల వాము, గుప్పెడు తులసి ఆకులు, గుప్పెడు వేపాకులు, గుప్పెడు బిల్వపత్రం ఆకులు, 10గ్రాముల బెల్లం తీసుకొని వీటిని మిశ్రమంలాగా చేసి వారం రోజుల పాటు రోజుకు ఒకసారి తినిపించాలి.