News February 7, 2025
మంత్రి సంధ్యారాణికి మీరిచ్చే ర్యాంక్ ఎంత?

మొదటిసారి MLAగా గెలిచిన గుమ్మిడి సంధ్యారాణి చంద్రబాబు క్యాబినేట్లో మహిళా& శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే 25 మంది మంత్రుల పనితీరుపై ర్యాంకులు కేటాయించగా సంధ్యారాణికి 19 ర్యాంక్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో సీనియర్లు అయిన అచ్చెన్నకు 17, అనితకు 20 ర్యాంక్ ఇవ్వగా.. తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన కొండపల్లి 3వ ర్యాంక్ సాధించారు. మరి సంధ్యారాణి పనితీరుకు మీరెచ్చే ర్యాంకు ఎంత?
Similar News
News November 20, 2025
పోలి పాడ్యమి ఎప్పుడు జరుపుకోవాలంటే..?

పోలి పాడ్యమిని నవంబర్ 21వ తేదీన(శుక్రవారం) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ‘పాడ్యమి తిథి నవంబర్ 20 ఉదయం 10:30కి ప్రారంభమై, నవంబర్ 21 మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. సూర్యోదయాన్ని పరిగణనలోకి తీసుకొని నవంబర్ 21నే పోలి పాడ్యమి నిర్వహించాలి. ఇక నవంబర్ 22, 2025 శనివారం తెల్లవారుజామున 4:35 నుంచి 6:00 గంటల వరకు దీపాలను నీటిలో వదలడానికి అనుకూల సమయం’ అని చెబుతున్నారు.
News November 20, 2025
ఫోన్‌పే టాప్!

మన దేశంలో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే ఆధిపత్యం కొనసాగుతోంది. 45.47% మార్కెట్ షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గూగుల్ పే (34.62%), పేటీఎం (7.36%), Navi (2.78%), సూపర్ మనీ (1.28%) ఉన్నాయి. ఫోన్‌పే, గూగుల్ పే కలిపి 80 శాతానికి పైగా మార్కెట్ షేర్‌ను కలిగి ఉండటం విశేషం. BHIM, CRED లాంటి ప్లాట్‌ఫామ్స్ కూడా వినియోగిస్తున్నారు. మరి మీరు ఏది వాడుతున్నారో కామెంట్ చేయండి.
News November 20, 2025
ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన ఆటో డ్రైవర్

ఎండాడకు చెందిన బొబ్బిలి రమేశ్ ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలు, భార్యను పోషిస్తున్నాడు. ఈనెల 10న తన నివాసంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. తలలో తీవ్ర రక్తస్రావం అయ్యి ఆరోగ్యం క్షీణించడంతో బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించగా అంగీకరించడంతో అవయవాలను ఐదుగురికి అమర్చనున్నారు. కుటుంబసభ్యుల మంచి మనసును పలువురు మెచ్చుకున్నారు.


