News August 14, 2024
మంత్రి సీతక్కను కలిసిన హీరోయిన్ రెజీనా

MLG: సచివాలయంలో మంత్రి సీతక్కను హీరోయిన్ రెజీనా మర్యాదపూర్వకంగా కలిశారు. తాము తలపెట్టిన రూరల్ విమెన్ లీడర్ షిప్ ప్రోగ్రాంకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రి సీతక్కను హీరోయిన్ రెజీనా కోరారు. అనంతరం పలు అంశాలపై మంత్రి సీతక్కతో హీరోయిన్ చర్చించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
Similar News
News October 22, 2025
వరంగల్: ప్లాస్టిక్ సంచుల్లో పత్తి నిల్వ చేయొద్దు

పంట చేలలో పత్తి ఏరిన రైతులు ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేసి అనంతరం కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారని, ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేయడం ద్వారా సంచుల దారాలు పత్తిలో ఇరుక్కుపోయి నాణ్యత తగ్గిపోతుందని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలిపారు. పత్తి ఏరిన సమయంలో బట్ట సంచులు లేదా చీరల్లో పత్తిని నిల్వ చేయాలని సూచించారు. సంచిలో పత్తి ఎక్కువ పట్టాలని కుక్కి తీసుకు వస్తారని, అలా కూడా చేయకూడదన్నారు.
News October 20, 2025
అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి: వరంగల్ కలెక్టర్

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో పండుగను ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
News October 19, 2025
వరంగల్: 23 వరకు గడువు.. 27న డ్రా

బీసీ బంద్, బ్యాంకుల బంద్తో మద్యం షాపునకు దరఖాస్తులు వేసే ఉత్సాహకులు రాలేకపోయామని, వారు చేస్తున్న విజ్ఞప్తి మేరకు దరఖాస్తులు స్వీకరించడానికి గడువు పెంచుతున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ నెల 23న కలెక్టర్ల సమక్షంలో జరగాల్సిన మద్యం షాపుల డ్రాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 27న డ్రా తీయనున్నట్లు చెప్పారు.