News August 13, 2024

మంత్రి సీతక్కను కలిసిన హీరోయిన్ రెజీనా..

image

MLG: సచివాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను హీరోయిన్ రెజీనా మర్యాదపూర్వకంగా కలిశారు. తాము తలపెట్టిన రూరల్ విమెన్ లీడర్ షిప్ ప్రోగ్రాంకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రి సీతక్కను హీరోయిన్ రెజీనా కోరారు. అనంతరం పలు అంశాలపై మంత్రి సీతక్కతో హీరోయిన్ చర్చించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

Similar News

News September 20, 2024

వరంగల్: తగ్గుతున్న పత్తి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు మళ్లీ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,860 పలకగా.. బుధవారం రూ.7,810కి పడిపోయింది. గురువారం కొంత పెరిగి రూ. 7,850 చేరగా నేడు మళ్లీ తగ్గి రూ.7,825 అయిందని అధికారులు తెలిపారు. పత్తి ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.

News September 20, 2024

కేయూ కాంట్రాక్టు లెక్చరర్‌పై మరో ఫిర్యాదు

image

కేయూ కాంట్రాక్టు లెక్చరర్ శ్రీధర్ కుమార్ లోథ్‌పై మరో మహిళ పార్ట్ టైమ్ లెక్చరర్ ఫిర్యాదు చేశారు. బదిలీ విషయంలో వేధిస్తూ అడ్డుకుంటున్నాడని తెలుగు డిపార్ట్‌మెంట్ లెక్చరర్ అన్నపూర్ణ అతడిపై గురువారం రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు ఇచ్చారు.కాగా ఈ నెల 16న తెలుగు డిపార్ట్‌మెంట్ HOD జ్యోతి తనను శ్రీధర్ కుమార్ లోథ్ మానసికంగా వేధిస్తున్నాడని రిజిస్ట్రార్‌‌కు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికే అతడికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

News September 20, 2024

మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేత

image

రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో సింథటిక్ శాలువాలు వాడకుండా చేనేత శాలువాలు, చేనేత బ్యాగులు వాడేలా ఆదేశాలు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. అనంతరం దేవాలయాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రి కొండా సురేఖతో నేతలు చర్చించారు.