News February 6, 2025

మంత్రి స్వామికి 5వ ర్యాంక్

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో ప్రకాశం జిల్లా మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి 5వ ర్యాంక్, బాపట్ల జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ 13వ ర్యాంక్ పొందారు. పనితీరును మెరుగు పరుచుకోవాని CM సూచించారు.

Similar News

News February 7, 2025

ఒంగోలు: విద్యాశాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్

image

పాఠశాలల పునఃనిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రతి మండలం నుంచి తయారు చేయబడిన పీపీటీలను కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం రివ్యూ చేశారు. మండల విద్యాశాఖాధికారులు తయారు చేసిన పీపీటీల ద్వారా వారి మండలాలలో పాఠశాల పునఃనిర్మాణం చేపట్టిన తరువాత ఏర్పాటుచేయబోయే పాఠశాలల వివరాలు తగిన ఆధారాలతో కలెక్టర్‌కి వివరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News February 6, 2025

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

image

చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకి చెందిన గంగవరపు శీను(35) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణం భార్య జ్యోతి, అత్తమామలే కారణమని లేఖ రాసి, నా ఇద్దరూ చిన్న పిల్లలు జాగ్రత్త అంటూ చనిపోయినట్లు సమాచారం. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News February 6, 2025

ప్రకాశం: ఒకే రోజు ముగ్గురు మృతి

image

ప్రకాశం జిల్లాలో బుధవారం వివిధ ఘటనలలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పొదిలి మండలం కంబలపాడు కి చెందిన సుబ్బరత్తమ్మ పొలంలో విద్యుత్ షాక్‌కి గురై మరణించారు. దర్శి మండలానికి చెందిన నారాయణమ్మ పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మరణించారు. అలాగే వరికుంటపాడు నుంచి పామూరు వస్తున్న బాలయ్య అనే వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు.

error: Content is protected !!