News March 13, 2025

మంత్రులతో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

image

రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌తో విజయనగరం ఉమ్మడి జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు ఎస్ కోట ఎమ్మెల్యే లలిత కుమారి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు, విజయనగరం ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు, పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర తదితరులు అసెంబ్లీ లాబీలో గురువారం కలుసుకున్నారు.

Similar News

News March 20, 2025

మన్యంకొండ హుండీ ఆదాయం రూ.35.26 లక్షలు

image

మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత బుధవారం 2వసారి హుండీ లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన సొమ్ము మొత్తం రూ.35,26,085 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ అళహరి మధుసూదన్ కుమార్, అళహరి రామకృష్ణ, ఈవో శ్రీనివాసరాజు, సహాయ కమిషనర్ మదనేశ్వర్, సూపరింటెండెంట్ నిత్యానంద చారి, IDBC మేనేజర్ నీలకంఠ పాల్గొన్నారు.

News March 20, 2025

రైల్వేకోడూరు ఎమ్మెల్యే కాలుకు గాయం

image

రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు మధ్య నిర్వహించిన క్రీడా పోటీల్లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్ పాల్గొన్నారు. బుధవారం కబడ్డీ ఆడుతూ ఆయన కింద పడిపోయారు. కిందపడిన ఆయనకు కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో శ్రీధర్‌ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాలు ఫ్రాక్చర్ తీవ్రత గురించి తెలియాల్సి ఉంది.

News March 20, 2025

WGL: GREAT.. తండ్రి కల నెరవేర్చిన పేదింటి బిడ్డ!

image

తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ వన్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాల్లో నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన మౌనిక భద్రాద్రి జోన్‌లో 9వ ర్యాంకుగా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగం కచ్చితంగా సాధించాలని కన్న తండ్రి కలను ఎట్టకేలకు కూతురు నెరవేర్చింది. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మౌనిక సగృహానికి చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు.

error: Content is protected !!