News January 11, 2026
మంథని అభివృద్ధికి రూ.45 కోట్లతో శ్రీధర్ బాబు శంకుస్థాపన

మంథని మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు రూ.45 కోట్ల రూపాయలతో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో బస్ స్టాండ్‌లు, కుల సంఘాల కమ్యూనిటీ హాల్‌లు, సీసీ రోడ్ల నిర్మాణాలు, బ్రిడ్జి నిర్మాణం, దేవాలయాల సుందరీకరణ పనులు, ఈద్గా నిర్మాణం పనులు, వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవం, మహిళా సంఘం భవన నిర్మాణం పనులు ఉన్నాయి. వీటితో మంథనికి మహర్దశ పట్టనున్నది.
Similar News
News January 15, 2026
అన్నమయ్య జిల్లాలో కొర్రమీను పెంపకం.. లాభాలమయం..!

అన్నమయ్య జిల్లాలో PMDDKY పథకం కింద ఫామ్‌పాండ్‌ల ఆధారంగా (ముర్రెల్) కొర్రమీను పెంపకం విజయవంతంగా సాగుతోంది. కిలోకు రూ.300 – రూ.500 వరకు లభించడంతో లాభాలు వస్తున్నాయి. శాస్త్రీయ పద్ధతులతో ఒక్క సైకిల్‌లో 0.5 నుంచి 1 టన్ను వరకు ఉత్పత్తి వస్తోంది. ఉద్యానవన పంటలతోపాటు చేపల సాగు చేపడితే ఒక్క పంటకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు నికర ఆదాయం లభిస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇండియా పేర్కొంది.
News January 15, 2026
బీసీలకు 42% సీట్లు.. పార్టీలు ఇచ్చేనా?

TG: మున్సిపల్ ఎన్నికల్లో SC ఆదేశాలతో రిజర్వేషన్లు 50% మించకుండా అమలు చేశారు. BCలకు 42% స్థానాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్, BRSకు ఇదో అవకాశంగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో 32%(38 స్థానాలు) కార్పొరేషన్‌లో 30%(3 చోట్ల) కేటాయించింది. కాగా హామీని నెరవేర్చేందుకు మరో 12 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలోనూ BC అభ్యర్థులనే ప్రకటించాల్సి ఉంది. మరి పార్టీలు ఎలాంటి ప్రకటన చేస్తాయో చూడాలి.
News January 15, 2026
గజ్వేల్: KCR ఫాంహౌస్‌లో సంక్రాంతి సంబరాలు

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి KCR తన కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. సంక్రాంతి సందర్భంగా ఆయన సతీమణి శోభ, కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు కోడలు, మనవడు, మనవరాలితో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.


