News February 14, 2026
మంథని: ఒకరికి ఒకటి.. ఇద్దరికీ రెండు ఓట్లు

ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం. కానీ, అభ్యర్థులు ఒకటి.. రెండు ఓట్లు మాత్రమే సాధించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మంథని మున్సిపాలిటీలో పోటీచేసిన ఆరుగురు అభ్యర్థులు (స్వతంత్రులు) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఇందులో ఒకటో వార్డులో పోటీ చేసిన కిన్నెర వెన్నెల ఒక్క ఓటు మాత్రమే సాధించింది. అలాగే 11వ వార్డులో డీకొండ రవికిరణ్ కు రెండు ఓట్లు, జక్కం రంజిత్ కుమార్ రెండు ఓట్లు సాధించారు.
Similar News
News March 15, 2026
వలిగొండ: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

వలిగొండ-తిరుమలగిరి ప్రధాన రహదారిపై యాదాద్రి జిల్లా అరూరు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు ప్రారంభించారు.
News March 15, 2026
శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు

శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని 1,800 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పోలీస్ పాయింట్లు ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్క పోలీసు భక్తుల సేవలో నిమగ్నమై పనిచేస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా క్షేత్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.
News March 15, 2026
గుడిపల్లి రిజర్వాయర్ సందర్శించిన మాజీ మంత్రి నాగం

NGKL జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్‌ను ఆదివారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డా.నాగం జనార్దన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ పరిస్థితిని పరిశీలించి, సాగునీటి విడుదలపై ప్రభుత్వం అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పంటలు చేతికి వచ్చే కీలక సమయంలో రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇది రైతుల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.


