News February 7, 2025

మంథని : గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

image

మంథని పట్టణంలోని గంగపురి ప్రాంతంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 8, 2025

NZB: యువకుడి ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రాం

image

ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన గొడవ కారణంగా యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన మోపాల్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కంజర గ్రామానికి చెందిన విశాల్(19) మరో ఇద్దరు స్నేహితుల మధ్య ఇంస్టాగ్రామ్ విషయంలో గొడవ జరిగింది. దీంతో విశాల్ గత నెల 16న పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

News February 8, 2025

హసీనా వ్యాఖ్యలతో భారత్‌కు సంబంధం లేదు: విదేశాంగ శాఖ

image

బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని భారత్‌లో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనా పిలుపునివ్వడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆమె వ్యాఖ్యలతో ఇండియాకు సంబంధం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ స్పష్టం చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తాము ఎప్పుడూ కృషి చేస్తామన్నారు. బంగ్లా అంతర్గత వ్యవహారాలను INDకు ముడిపెట్టడం సరికాదని ఆ దేశ అధికారులకు తేల్చిచెప్పారు.

News February 8, 2025

సంగారెడ్డి: నేడు పాఠశాలలకు పని దినం: డీఈవో

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర యాజమాన్యంకు సంబంధించిన పాఠశాలలు రేపు పని చేస్తాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించినందుకు, రేపు పాఠశాలల యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల హెచ్ఎమ్‌లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

error: Content is protected !!