News February 7, 2025

మంథని : గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

image

మంథని పట్టణంలోని గంగపురి ప్రాంతంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 18, 2026

మెదక్ కలెక్టర్‌కు జైలు శిక్ష.. కారణం ఇదే!

image

కోర్టు ధిక్కరణకు పాల్పడిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు హైకోర్టు 6 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. చేగుంట మండలం బోనాల్‌లోని భూ వివాదంపై ఇరుపక్షాలకు నోటీసులిచ్చి పరిష్కరించాలన్న కోర్ట్ ఆదేశాలను కలెక్టర్ అమలు చేయలేదు. తగిన ఆధారాలు లేకుండా దరఖాస్తును తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ కె.లక్ష్మణ్, ఆయన ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని తీర్పు వెలువరించారు.

News February 18, 2026

ఏలూరు: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లికి నిరాకరణ..యువతి నిరసన

image

నిశ్చితార్థం తర్వాత వివాహం చేయడం లేదంటూ యువతి మంగళవారం ఆందోళనకు దిగింది. కైకలూరు గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన అల్పర్ హుస్సేన్‌తో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. 11 నెలల కిందట ముస్లిం పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ ఏడాది జనవరిలో వివాహం జరగాల్సి ఉంది. కానీ యువకుడు పెళ్లి చేసుకోకుండా దాట వేయడంతో మంగళవారం కుటుంబసభ్యులతో యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది.

News February 18, 2026

YouTube డౌన్

image

ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. మొబైల్, డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదు. యాక్సెస్ చేయాలని చూస్తుండగా ‘Something went wrong’ అని చూపిస్తోంది. దీంతో యూజర్లు సోషల్ మీడియాలో యూట్యూబ్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. మీకూ ఇలాగే అవుతోందా? మరోవైపు అంతరాయంపై పేరెంట్ కంపెనీ గూగుల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.