News July 6, 2024
మంథని: చంద్రబాబును కలిసిన మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న చారిత్రాత్మిక సమావేశంలో మంథని ఎమ్మెల్యే, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు పాల్గొన్నారు.
Similar News
News November 28, 2025
KNR: వ్యాసెక్టమీ శస్త్ర చికిత్సల క్యాంపును సందర్శించిన డీఎంహెచ్ఓ

జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరుగుతున్న కుటుంబ నియంత్రణ వ్యాసెక్టమీ శస్త్ర చికిత్సల క్యాంపును డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, కుటుంబ నియంత్రణ ప్రోగ్రాం ఆఫీసర్ డా.సనా జవేరియాతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాసెక్టమీ శస్త్ర చికిత్సలు చేసుకోబోతున్న, చేసుకున్న అర్హులైన దంపతులను కలిసి మాట్లాడారు. కరీంనగర్ ఆస్పత్రిలో 7, జమ్మికుంట సీహెచ్సీలో 6, మొత్తం 13 మందికి వ్యాసెక్టమీ చికిత్సలు జరిగాయన్నారు.
News November 28, 2025
కరీంనగర్ కలెక్టర్కు భారత్ గౌరవ్ అవార్డు

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హైదరాబాద్లో ప్రతిష్టాత్మక భారత్ గౌరవ్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జీష్ణు దేవ్, చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా స్వీకరించారు. వినూత్న ఆలోచనలతో సమాజ చైతన్యం కోసం విలక్షణ కార్యక్రమాలు చేపడుతున్న కలెక్టర్కు ఈ అవార్డు ప్రదానం చేసినట్లు భారత్ గౌరవ అవార్డు కమిటీ స్పష్టం చేసింది. విధి నిర్వహణలో కలెక్టర్ చేస్తున్న కృషిని కొనియాడారు.
News November 28, 2025
KNR: శుక్రవారం సభను సందర్శించిన అడిషనల్ కలెక్టర్

మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్ మండలం కొత్తపల్లి సెక్టార్, రాజీవ్ గృహకల్ప, అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే హాజరై మాట్లాడారు. మహిళలు తమ సమస్యలు ఏవైనా శుక్రవారం సభలో విన్నవించుకోవచ్చని అన్నారు. ప్రతి మహిళలు గర్భిణీ, బాలింత శుక్రవారం సభకు తప్పక హాజరు కావాలని సూచించారు.


