News April 13, 2025
మంథని: చెడగొట్టు వాన.. అన్నదాత గుండె పగిలే

మంథని మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోతల దశలో ఉన్న వరి పంటలు వర్షానికి దెబ్బతింటుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కల్లాలలో పోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవుతుండటంతో చేతికి వచ్చే ఆశలు కూడా లేవని కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Similar News
News October 28, 2025
కర్నూలు: గృహ నిర్మాణంపై చర్చించిన హౌసింగ్ డైరెక్టర్

కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన ఆరేకల్ రామకృష్ణ మంగళవారం హౌసింగ్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇద్దరూ జిల్లా గృహ నిర్మాణ ప్రగతిపై, అలాగే 2014–2019 మధ్య పెండింగ్లో ఉన్న హౌసింగ్ బిల్లుల పరిష్కారం వంటి అంశాలపై విశదంగా చర్చించారు.
News October 28, 2025
కురుమూర్తి ఉద్దాల ఉత్సవంలో జేబుదొంగల చేతివాటం

వడ్డేమాన్ ఉద్దాల మండపం వద్ద కురుమూర్తి స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. లాలకోటకు చెందిన నర్సింహులు జేబులో ఉన్న దాదాపు రూ.10 వేలను దొంగిలించారు. వందలాది పోలీసులు భద్రతలో ఉన్నప్పటికీ, జేబుదొంగలు తమ పనిని కొనసాగించడం విశేషం. కాగా జాతర మైదానంలో ఏటా ఇలాంటి ఘటనలు సర్వ సాధారణంగా మారిపోయాయి. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
News October 28, 2025
అనకాపల్లి: ‘50% సబ్సిడీపై పశువుల దాణా పంపిణీకి సిద్ధం’

అనకాపల్లి జిల్లాలో 50% సబ్సిడీతో పంపిణీ చేసేందుకు 860 మెట్రిక్ టన్నుల పశువుల దాణా సిద్ధంగా ఉందని జిల్లా పశు వైద్యాధికారి బి.రామ్మోహన్రావు తెలిపారు. మంగళవారం మాకవరపాలెంలో ఆయన మాట్లాడారు. తుఫాను కారణంగా పశువులకు మేత ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇప్పటికే పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి మండలాల్లో 40 మెట్రిక్ టన్నులు సబ్సిడీపై అందజేశామన్నారు.


