News January 24, 2025
మంథని: దావోస్లో మంత్రి శ్రీధర్ బాబు

వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF2025) సదస్సు ఈనెల 20వ తేదీన ప్రారంభం కాగా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ. 1,78,950 కోట్ల రికార్డు స్థాయి పెట్టుబడులు వచ్చిన విషయం విధితమే. అయితే ఈ నెల 27వ తేదీ వరకు మంథని ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు దావోస్లోనే ఉండనున్నారు. చివరి సమావేశాల వరకు అక్కడే ఉండి ఈనెల 27వ తేదీన హైదరాబాద్కు రానున్నారు.
Similar News
News October 14, 2025
BREAKING: బాపట్ల జిల్లా వాసి దారుణ హత్య

తెనాలిలోని చెంచుపేటలో బాపట్ల జిల్లా వాసి దారుణ హత్యకు గురయ్యాడు. అమృతలూరు (M) కోడితాడిపర్రుకు చెందిన జూటూరు బుజ్జి (50) కైలాష్ భవన్ రోడ్డులో మంగళవారం టిఫిన్ కోసం వచ్చాడు. ఆ సమయంలో స్కూటీపై వచ్చిన ఓ వ్యక్తి కొబ్బరికాయల కత్తితో హత్య చేశాడు. 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా మృతుడు తన కూతురుని చూసేందుకు చెంచుపేటకు వచ్చినట్లు సమాచారం.
News October 14, 2025
తెనాలిలో హత్య.. మృతుని వివరాలు..!

తెనాలి చెంచుపేటలోని కైలాశ్ భవన్ రోడ్డులో బుజ్జిని పట్ట పగలే హత్య చేసిన విషయం తెలిసిందే. మాస్క్ ధరించి స్కూటీపై వచ్చిన వ్యక్తి హత్య చేసి పరారైనట్లు స్థానికులు చెప్తున్నారు. కాగా మృతుడు బాపట్ల జిల్లా అమృతలూరు (M) కోడితాడిపర్రుకి చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు. మృతుడు తమ కుమార్తెను చూసేందుకు చెంచుపేటకు వచ్చినట్లు సమాచారం.
News October 14, 2025
PDPL: లొంగిపోయిన మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్..!

PDPL పట్టణానికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, సోను మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. MHలోని గడిచిరోలిలో 60మందితో కలిసి సరెండరయ్యారు. ఇక మల్లోజులపై రూ.కోటి రివార్డుంది. అయితే తాను లొంగిపోయేది లేదని గతంలో తల్లి మధురమ్మకు వేణుగోపాల్ లేఖ రాశారు. కాగా వేణుగోపాల్ సోదరుడు, కేంద్ర కమిటీ సభ్యుడు కోటేశ్వరరావు బెంగాల్లో గతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందారు.