News November 2, 2024
మంథని: మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
మంథని ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబును ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్సీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందని, బల్మూరు వెంకట్‌కు ఎమ్మెల్సీ పదవి రావడం ఇందుకు నిదర్శనమని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
Similar News
News December 9, 2024
మంత్రి పొన్నంను కలిసిన బిగ్ బాస్ సీజన్-8 ఫేమ్ సోనియా
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గానికి చెందిన ఆకుల సోనియా ఇటీవల బిగ్‌బాస్ సీజన్-8కి వెళ్లి వచ్చింది. కాగా, నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సోనియా మర్యాదపూర్వంగా కలిశారు. తన వివాహానికి హాజరుకావాలని కాబోయే భర్తతో కలిసి మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు, తదితరులు ఉన్నారు.
News December 9, 2024
ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోం: మంత్రి శ్రీధర్ బాబు
ప్రతిపక్ష నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ మేరకు వరంగల్ పర్యటన సమయంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోమని, ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. 6 గ్యారెంటీల వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని, ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తామన్నారు.
News December 8, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ వెల్గటూర్ మండలంలో విద్యుత్ షాక్‌తో ఆటో డ్రైవర్ మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ రామగుండంలో ప్రైవేట్ విద్యాలయం ప్రిన్సిపల్ పై దాడి. @ తంగళ్ళపల్లి మండలంలో మానేరులో దూకి వ్యక్తి ఆత్మహత్య. @ కథలాపూర్ మండలంలో మాజీ ఎంపీపీ భర్త మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో విద్యుత్ షాక్‌తో మేకలు, గొర్రెలు మృతి. @ మెట్పల్లిలో అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులు.