News February 16, 2025
మంథని: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు

మంథని-గోదావరిఖని ప్రధాన రహదారిపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విలోచవరం గ్రామానికి చెందిన తోట రాయమల్లును ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో తలకు, కాలుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కాలు విరగ్గా భయానకమైన దృశ్యాలు కనబడుతున్నాయి. స్థానికుల సాయంతో 108లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 24, 2025
26న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి టైమ్ ఫిక్స్ అయింది. ఈ నెల 26న అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఛాంబర్లో నవీన్ యాదవ్‌తో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ పెద్దలు హాజరుకానున్నారు. కాగా, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
News November 24, 2025
అది మీ తప్పు కాదు

ప్రేమలో విఫలం అయిన తర్వాత చాలామంది తమ లోపాల వల్లే అలా అయిందని బాధపడుతుంటారు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు డిప్రెషన్‌కు కారణమవుతాయంటున్నారు నిపుణులు. వాళ్ల ఆలోచనలు, గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం సరికాదు. సానుకూల దృక్పథం, స్వీయ ప్రేమను అలవర్చుకొని జీవితంలో ముందుకు సాగాలి. ఎంత ప్రయత్నించినా బాధ నుంచి బయటపడలేకపోతుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.
News November 24, 2025
ముగిసిన ఐబొమ్మ రవి విచారణ.. కీలక విషయాలు వెలుగులోకి!

మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ రవి 5 రోజుల పోలీసు విచారణ ముగిసింది. స్నేహితుడు నిఖిల్‌తో కలిసి రవి డేటా హ్యాండ్లింగ్, సర్వర్ యాక్సెస్ వంటి అంశాల్లో పాల్గొన్నట్లుగా సమాచారం. టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాల కొనుగోలు, USDT చెల్లింపులు, APK లింక్స్‌తో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినట్లు తెలుస్తోంది. విచారణ ముగిశాక రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.


