News February 16, 2025

మంథని: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు

image

మంథని-గోదావరిఖని ప్రధాన రహదారిపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విలోచవరం గ్రామానికి చెందిన తోట రాయమల్లును ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో తలకు, కాలుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కాలు విరగ్గా భయానకమైన దృశ్యాలు కనబడుతున్నాయి. స్థానికుల సాయంతో 108లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 24, 2025

వరంగల్: డ్రగ్స్, గంజాయిపై ఉక్కు పాదం: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల జిల్లా నిరోధక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ గంజాయి వంటి మాదకద్రవ్యాల రవాణా వినియోగంపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. వీటి రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి హైవేల వద్ద తనిఖీలు చేపట్టాలన్నారు.

News March 24, 2025

21 బంతుల్లో హాఫ్ సెంచరీ

image

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ వీర విహారం చేశారు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశారు. ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదారు. మరోవైపు పూరన్ సైతం ధాటిగా ఆడుతున్నారు. 7 ఓవర్లలో స్కోరు 89/1.

News March 24, 2025

PDPL: అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: అడిషనల్ కలెక్టర్

image

ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ దాసరి వేణు సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సంబంధిత అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు.

error: Content is protected !!